భారతదేశం, జూన్ 14 -- ప్రతి వారం కొత్త ఆశలతో మొదలవుతుంది. ఈ జూన్ మూడవ వారంలో గ్రహాల స్థితిగతులు ఏయే రాశుల వారికి అదృష్టాన్ని అందిస్తున్నాయో, ఎవరెవరు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోవడం వల్ల ముందుస్తు ప్రణాళికలు వేసుకోవడం సులభమవుతుంది. మీ రాశిచక్రం ఆధారంగా ఈ వారం (జూన్ 15 - 21, 2026) ఎలా ఉండబోతోందో వివరంగా చూద్దాం.

ఈ వారం మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి పలు పనులు మీ ముందుకు రావడంతో ప్రారంభంలో కొంత అసహనానికి లోనైనా, క్రమంగా పరిస్థితి మీ అదుపులోకి వస్తుంది. ఉద్యోగస్తులు తమ పనిపై దృష్టి సారించాలి; మీ పాత పనులకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి, కాబట్టి అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో చిన్నపాటి వాదోపవాదాలు వచ్చే అవకాశం ఉన్నందున మాటపై నియంత్రణ అవసరం.

శుభ రంగు: ఎరుప...