భారతదేశం, నవంబర్ 17 -- భారత ఆటోమొబైల్ విపణిలో లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీల విభాగంలో ఆసక్తికరమైన పోటీ మొదలైంది. ప్రపంచ ప్రఖ్యాత ఈవీ దిగ్గజం బీవైడీ తన లగ్జరీ విభాగమైన 'డెంజా' బ్రాండ్‌ను భారత్‌కు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా జెడ్9 జీటీ కారుతో పాటు అత్యంత విలాసవంతమైన 'డెంజా డీ9' ఎంపీవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. భారత విపణిలో ఎంపీవీ కార్లకు ఆదరణ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం కియా కారెన్స్ క్లావిస్, టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతీ సుజుకీ ఇన్విక్టో, బీవైడీ ఈమ్యాక్స్ 7, విన్‌ఫాస్ట్ వీఎఫ్ ఎంపీవీ7, కియా కార్నివాల్, ఎంజీ ఎం9, టయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎల్ఎం350హెచ్ వంటి అనేక మోడళ్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే పూర్తి స్థాయి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీగా వచ్చిన డెంజా డీ9, నేరుగా అదే విభాగంలో ఉన్న 'ఎంజీ ఎం9' కారుతో తలపడుతోంది.

విమానంలోన...