భారతదేశం, ఆగస్టు 3 -- Deewana OTT: థియేటర్లలో మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న యంగ్ హీరో హర్షిత్ రెడ్డి లేటెస్ట్ లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'దీవానా' (Deewana) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా (Aha) లో రీసెంట్‌గా ప్రీమియర్ అయిన ఈ సినిమా.. అతి తక్కువ టైమ్‌లోనే ఏకంగా 50 మిలియన్ డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ని సాధించి బిగ్గెస్ట్ మైలురాయిని చేరుకుంది.

ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌తో డిజిటల్ స్పేస్ లో ఈ మూవీ ట్రెండింగ్ టాప్‌లో దూసుకుపోతోంది.

'మేమ్ ఫేమస్', 'బలగం' వంటి చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి.. 'దీవానా' సినిమాలో తన నేచురల్ పెర్ఫార్మన్స్‌తో దుమ్మురేపాడు. లవ్, ఎమోషన్, ఫన్ కలగలిపిన రోల్‌లో హర్షిత్ జీవించేయగా, హీరోయిన్‌...