భారతదేశం, ఏప్రిల్ 8 -- Deepika Padukone: బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్: ది రివెంజ్' సృష్టిస్తున్న సునామీ అంతా ఇంతా కాదు. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా సక్సెస్‌ను యావత్ బాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంటోంది. అయితే ఈ ఆనందంలో రణవీర్ భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఎక్కడా కనిపించకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

తన భర్త సాధించిన ఇంతటి ఘనవిజయంపై దీపిక ఎందుకు స్పందించడం లేదంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై దీపికా పదుకోన్ తనదైన శైలిలో స్పందిస్తూ విమర్శకుల నోళ్లు మూయించింది.

తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా రణవీర్ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండటంపై వస్తున్న విమర్శలకు దీపికా పదుకోన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఘాటు సమాధానం ఇచ్చింది. ఒక పోస్ట్‌పై స్పందిస్తూ.. "మీ అందరికంట...