భారతదేశం, మే 16 -- ప్రతిరోజు దీపం వెలిగించడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం అని చెప్పొచ్చు. అయితే ప్రతి సమస్యకి కూడా కొన్ని రకాల దీపాలు అద్భుతంగా పని చేస్తాయి. చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు మొదలు ఆరోగ్య సమస్యల దాకా, ఈరోజు ఏ దీపాలను వెలిగించడం వలన లాభాలను పొందవచ్చో తెలుసుకుందాం.

సాధారణంగా మనం మనకి నచ్చిన నూనెతో దీపారాధన చేస్తూ ఉంటాము. కానీ ఎన్ని రకాల దీపాలు ఉన్నాయో మీకు తెలుసా? ఈరోజు విశిష్ట దీపారాధన రకాలు, వాటి వలన కలిగే ఫలితాలు తెలుసుకుందాం.

ఒక ప్రమిదిలో ఉప్పు వేసి, అందులో మరో ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించినట్లయితే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి ఇది అద్భుత పరిష్కారం.

దీనిని నారికేళ దీపం అని కూడా అంటారు. కొబ్బరికాయ...