భారతదేశం, ఏప్రిల్ 13 -- Dacoit Collection: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ 'డెకాయిట్'. అనేక వాయిదాల తర్వాత థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి వీకెండ్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు రాణించిందో చూద్దాం.

ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ సక్నిల్క్ నివేదిక ప్రకారం, విడుదలైన మూడో రోజైన ఆదివారం (ఏప్రిల్ 12) డెకాయిట్ రూ. 6.59 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సాధారణంగా అయితే సండే కలెక్షన్లు పెరగాల్సింది. కానీ డెకాయిట్ మూవీ వసూళ్లు మాత్రం నిలకడగా కొనసాగాయి.

మొదటి రోజు శుక్రవారం రూ. 6.55 కోట్లు, రెండో రోజు శనివారం రూ. 6.85 కోట్లు వసూలు చేసిన డెకాయి...