భారతదేశం, అక్టోబర్ 6 -- ప్రశాంతతకు మారుపేరైన ఒడిశాలోని కటక్​ మతపరమైన ఘర్షణలతో ఆదివారం ఉలిక్కిపడింది! రెండు రోజుల క్రితం దుర్గా మాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణల తర్వాత తాజా హింసాత్మక సంఘటనలు ఆదివారం కూడా కొనసాగాయి. దీనితో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ నగరం ఉద్రిక్తంగా మారింది.

ఈ ఘర్షణలకు దర్గా బజార్ ప్రాంతంలో నిమజ్జన ఊరేగింపు సమయంలో పెద్ద శబ్దంతో సంగీతం ప్లే చేయడంపై తలెత్తిన విభేదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ వివాదం క్రమంగా పెరిగి ఘర్షణలకు దారి తీసింది. చివరికి ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, బంద్‌కు పిలుపునివ్వడం, రాజకీయ వర్గాల నుంచి శాంతి సందేశాలు వెలువడే వరకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో, దర్గా బజార్ ప్రాంతంతో పాటు పలుచోట్ల నగర పాలక యంత్రాంగం 36 గంటల కర్ఫ్యూ విధించింది.

కటక్​ హింసపై పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథ...