భారతదేశం, నవంబర్ 21 -- Jiohotstar Crime Thrillers OTT: ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ తీవ్రంగా పెరిగిన ఈ రోజుల్లో.. ప్రేక్షకులను తమవైపు తిప్పుకోవడం ప్రతి ఓటీటీ సంస్థకు పెద్ద సవాలుగా మారింది. ఈ రేసులో జియోహాట్‌స్టార్ తనదైన ముద్ర వేస్తూ బలమైన పోటీదారుగా ఎదిగింది. ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్ నుంచి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్స్ వరకు 7 టాప్ క్రైమ్ థ్రిల్లర్లు ఇక్కడున్నాయి.

పాపులర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బ్యాట్‌మ్యాన్ ట్రయాలజీలో రెండో భాగంగా వచ్చిన 'ది డార్క్ నైట్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గోథమ్ నగరంలో నేరాలను అరికట్టేందుకు బ్రూస్ వేన్ అలియాస్ బ్యాట్‌మ్యాన్ (క్రిస్టియన్ బేల్), డిస్ట్రిక్ట్ అటార్నీ హార్వే డెంట్ (ఆరోన్ ఎక్‌హార్ట్), లెఫ్టినెంట్ జేమ్స్ గోర్డాన్ (గ్యారీ ఓల్డ్‌మ్యాన్) కలిసి పనిచేస్తుంటారు. ...