భారతదేశం, ఆగస్టు 5 -- Crime Thriller OTT: తెలుగు ఓటీటీ ప్రియులకు హారర్, ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ల పట్ల ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా స్పానిష్, మలయాళం, అరబిక్ భాషల్లో వచ్చే డార్క్ థ్రిల్లర్ సినిమాలు తెలుగు డబ్బింగ్‌లో అందుబాటులోకి వస్తే డిజిటల్ వీక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వినూత్నమైన అరబిక్ మిస్టరీ థ్రిల్లర్‌ ఇండియన్ ఆడియన్స్ కోసం వచ్చేసింది.

అదే 'అన్ఐడెంటిఫైడ్' (Unidentified) మూవీ. ఇది అరబిక్ లో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా ఇవాళ (ఆగస్టు 5) ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఓటీటీలో ఈ చిత్రం అరబిక్ ఒరిజినల్ ఆడియోతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల డబ్బింగ్ ఆడియోలతో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.

కేవలం 1 గంట 39 నిమిషాల (99 నిమిషాలు) క్రిస్ప్ రన్‌టైమ్‌తో సాగే ఈ అన్ఐడెంటిఫైడ్ సినిమా కథాంశం ...