భారతదేశం, జూన్ 1 -- Crime Thriller: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో తన సరికొత్త ఒరిజినల్ సిరీస్ 'రాఖ్' ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. కేవలం ఒక సాధారణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లా కాకుండా, హ్యూమన్ సైకాలజీ, ఎమోషన్స్ కలబోతగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థమవుతోంది. అలీ ఫజల్, సోనాలి బింద్రే, రాకేష్ బేడీ, అమీర్ బషీర్ లాంటి భారీ స్టార్ కాస్ట్‌తో 1970ల నాటి ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది.

"పిల్లలు ఎప్పటి నుంచి కనిపించడం లేదు?" అనే ఒక సీరియస్ డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు అమాయక పిల్లలు ఆచూకీ లేకుండా పోయిన తర్వాత, దేశ రాజధాని ఢిల్లీ సిటీ ఎలాంటి భయాందోళనలకు గురైందనే పాయింట్ ని ఇందులో కళ్లకు కట్టారు. పిల్లలు సాయంత్రం చీకటి పడ్డాక కూడా బయట ధీమాగా ఆడుకునే ఆ రోజుల్లో.. ఒకే ఒక్క ఘోర నేరం ప్రజల...