Crime news : స్పీడ్ మానిటరింగ్ డివైజ్ ఇన్స్టాల్ చేస్తుంటే ఢీకొట్టిన కారు- పోలీసు మృతి!
భారతదేశం, జూలై 16 -- దేశ రాజధాని దిల్లీలో హిట్ అండ్ రన్ కేసు కలకలం సృష్టించింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఒక కారు.. రహదారిపై విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌ను బలితీసుకుంది. ఆ సమయంలో సదరు పోలీసు.. స్పీడ్ మానిటరింగ్ డివైజ్‌ని ఇన్స్టాల్ చేస్తుండటం గమనార్హం.
బుధవారం సాయంత్రం ఔటర్ నార్త్ దిల్లీలోని సింఘు బోర్డర్ సమీపంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు సదరు కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల కథనం ప్రకారం.. దిల్లీ ట్రాఫిక్ విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ అమిత్ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సింఘు బోర్డర్ వద్ద ఉన్న ఒక ట్రాఫిక్ బూత్ సమీపంలో డ్యూటీలో ఉన్నారు. వాహనాల వేగాన్ని రికార్డ్ చేసే ఆన్-డ్యూటీ స్పీడ్ మానిటరింగ్ మిషన్‌ను ఆయన రోడ్డు పక్కన ఇన్స్టాల్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.