భారతదేశం, మే 19 -- Woman kills husband : గుజరాత్‌లో నెలల క్రితం జరిగి.. ఒక ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా గుర్తిచిన ఒక కేసును అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ చాకచక్యంగా ఛేదించింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్, గ్రౌండ్ వర్క్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు.. వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక ఘోరమైన హత్య ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చారు.

సురేంద్రనగర్ జిల్లా ద్రాంగధ్ర తాలూకా సోల్డి గ్రామానికి చెందిన శాంతిగిరి విష్ణుగిరి గోస్వామి అనే లారీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత స్థానిక కాల్వలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దానిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేశారు. అయితే, అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగి లోతుగా విచారించడంతో ఇదొక పక్కా స్కెచ్ ప్రకారం జరిగిన హత్యగా తేలింది.

ఈ కేసు నేపథ్యం చూస్తే తీవ...