భారతదేశం, మే 3 -- ఇల్లు కొనడం అనేది ఒక వ్యక్తి జీవితంలో అతిపెద్ద ఆర్థిక నిర్ణయం! అయితే, హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు బ్యాంకులు మీ ఆదాయంతో పాటు ప్రధానంగా చూసేది మీ "క్రెడిట్ స్కోర్." ఇది మీ అప్పు తీర్చే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఆర్బీఐ లైసెన్స్ పొందిన క్రెడిట్ సమాచార సంస్థ 'క్రిఫ్ హై మార్క్' నివేదిక ప్రకారం.. క్రెడిట్ స్కోర్ మీ హోమ్ లోన్ ఆమోదాన్ని మాత్రమే కాకుండా, మీకు లభించే వడ్డీ రేటును కూడా నిర్ణయిస్తుంది. మరి తక్కువ వడ్డీకి గృహ రుణం పొందాలంటే క్రెడిట్​ స్కోర్ ఎంత ఉండాలి?

భారతదేశంలో క్రెడిట్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మీ స్కోర్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి మీ లోన్ అవకాశాలు మారుతుంటాయి:

750 కంటే ఎక్కువ (అత్యుత్తమం): మీరు బ్యాంకులకు 'తక్కువ రిస్క్' ఉన్న కస్టమర్‌గా కనిపిస్తారు. దీనివల్ల లోన్ త్వరగా ఆమోదం పొందు...