భారతదేశం, నవంబర్ 4 -- Comedy Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది. ఆరేళ్ల కిందట యూట్యూబ్ లో రిలీజై సంచలన విజయం సాధించిన దిండోరా వెబ్ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్ నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. ఇప్పటికే తొలి సీజన్ ను కూడా ఈ ఓటీటీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

దిండోరా వెబ్ సిరీస్ మొదటి సీజన్‌లో లాటరీ టికెట్ చుట్టూ తిరిగిన కథ, సీజన్ 2కి వచ్చేసరికి మరింత రసవత్తరంగా, భారీ ఎత్తున మారనుంది. ఈ కొత్త సీజన్‌లో అందరి అభిమాన పాత్ర అయిన టీటూ మామా ఏకంగా రూ. 11 కోట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకోవడంతో పాటు తన అత్తవారింటి కుటుంబంతో ఊహించని వివాదాల్లో చిక్కుకుంటారు.

టీటూ మామా పాత్ర అంటేనే అవుట్ అండ్ అవుట్ కామెడీ రచ్చ, పదునైన డైలాగులు. అలాంటిది ఏకంగా రూ. 11 కోట్ల నష్టం, దానికి తోడు అత్తవారింటి గొడవలు తోడైతే ఎలాంటి రోలర్‌కోస్టర్ నవ...