భారతదేశం, అక్టోబర్ 16 -- పెరుగుతున్న ఇంధన ధరల భారం నుంచి తప్పించుకోవడానికి భారతీయ వాహనదారులు ఇప్పుడు సీఎన్జీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు సీఎన్జీ అనగానే పవర్ తక్కువగా ఉంటుందనే భావన ఉండేది, కానీ నేటి ఆధునిక టర్బో సీఎన్జీ ఇంజిన్లు ఆ అపోహను తిరగరాస్తున్నాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మహీంద్రా ఇటీవల సరికొత్త 'ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ జెడ్​ఎన్జీ' ని రూ. 9.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే ఈ విభాగంలో మంచి ఆదరణ పొందుతున్న 'టాటా నెక్సాన్ ఐసీఎన్జీ' కి ఇది గట్టి పోటీగా నిలుస్తోంది. మరి ఈ రెండు పాపులర్ టర్బో సీఎన్జీ ఎస్‌యూవీల్లో ఏది కొనుగోలు చేయడం ఉత్తమమో విశ్లేషిద్దాం.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ జెడ్‌ఎన్జీలో 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ ఎంపీఎఫ్‌ఐ ఇంజిన్‌ను అందించారు. ఇది 111 పీఎస్ పవర్, 200 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్...