భారతదేశం, జూలై 20 -- దేశ రాజధాని దిల్లీలో సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నీట్-యూజీ వైద్య ప్రవేశ పరీక్షల అక్రమాలకు నిరసనగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) పిలుపునిచ్చిన 'చలో సంసద్' మార్చ్ తీవ్ర ఘర్షణకు దారితీసింది. పార్లమెంట్ ముట్టడికి కోసం జంతర్ మంతర్ వద్ద నుంచి సీజేపీ మద్దతుదారులు బయలుదేరిన వెంటనే వారికి తీవ్ర అడ్డంకులు ఎదురయ్యాయి. నిరసనకారులు, దిల్లీ పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. పరిస్థితి చేదాటడంతో నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

వాస్తవానికి ఈ నిరసన ప్రదర్శనకు దిల్లీ పోలీసులు ఆదివారమే అనుమతి నిరాకరించారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాలతో పాటు దిల్లీ జిల్లా వ్యాప్తంగా ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడకుండా భారతీయ...