భారతదేశం, మార్చి 3 -- రామోజ్ ఫిల్మ్ సిటీ వేదికగా ఈనెల 14వ తేదీన 'సినీ మ్యాజికల్‌ గ్లో రన్‌' జరగనుంది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక ఈవెంట్‌లో ప్రొఫెషనల్ రన్నర్లు మాత్రమే కాదు ఆసక్తి ఉన్న కుటుంబాలు కూడా పాల్గొనొచ్చు.

ఈ గ్లో రన్‌కు సంబంధించిన జెర్సీ, విజేత పతకం ఆవిష్కరణ కార్యక్రమాాన్ని సోమవారం రామోజీ ఫిల్మ్‌సిటీ సందడిగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కూచిపూడి నర్తకి దీపికా రెడ్డి హాజరయ్యారు. గౌరవ అతిథిగా అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నం జెర్సీ పాల్గొనగా.. పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెర్సీని రన్ అంబాసిడర్లకు అందజేశారు.

ఈ సందర్భంగా దీపికా రెడ్డి మాట్లాడుతూ.. "గ్లో రన్‌లో కార్యక్రమంలోని ప్రతి అడుగు ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఈ రన్ గెలవడాని...