భారతదేశం, జూలై 21 -- Christopher Nolan: హాలీవుడ్ విజనరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey) మొదటి వీకెండ్‌లోనే 262.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,500 కోట్లు) గ్రాస్ రాబట్టి గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తన గత ఆస్కార్ విన్నింగ్ మాస్టర్‌పీస్ 'ఓపెన్‌హైమర్' రికార్డులను కూడా తుడిచిపెట్టేసిన ఈ డైరెక్టర్.. ఒకప్పుడు ఒక ఫిల్మ్ స్కూల్‌లో అడ్మిషన్ కోసం వెళ్తే అసలు టాలెంట్‌ లేదు పొమ్మని రిజెక్ట్ చేశారనే నిజం ఎంతమందికి తెలుసు?

ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, ది డార్క్ నైట్ ట్రయాలజీ లాంటి మైండ్ బెండింగ్ క్లాసిక్స్ అందించిన నోలన్.. ఇప్పుడు హాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా వెలుగుతున్నారు. కానీ కెరీర్ ప్రారంభంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు, ఎదురుదెబ్బలు ఏ సాధారణ డైరెక్టర్‌కైనా మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్...