భారతదేశం, ఏప్రిల్ 18 -- Chris Gayle Lalit Modi: ఐపీఎల్ (IPL) అంటేనే అన్-లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. ఇక్కడ రాత్రికి రాత్రే స్టార్లు పుట్టుకొస్తారు.. దిగ్గజాలు సైతం ఫామ్ కోల్పోతే కనుమరుగవుతారు. అయితే లీగ్ చరిత్రలో 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ 2011 వేలంలో ఈ దిగ్గజ ఆటగాడిని కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదన్న విషయం మీకు తెలుసా? ఆ గడ్డు కాలంలో గేల్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, లలిత్ మోదీ చేసిన ఫోన్ కాల్స్ గేల్ కెరీర్‌ను ఎలా మలుపు తిప్పాయో ఇప్పుడు చూద్దాం.

మైఖేల్ వాన్ హోస్ట్ చేసిన 'ది ఓవర్‌లాప్ క్రికెట్' కార్యక్రమంలో లలిత్ మోదీ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2011 ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత లండన్‌లో ఉన్న మోదీకి గేల్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది.

"నన్ను వేలంలో ఎవరూ తీసుకోలేదు, ఎందుకి...