భారతదేశం, జూన్ 11 -- Chocolate cravings why : పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడో, లేదా మూడ్ అస్సలు బాగోలేనప్పుడో చాలా మందికి చాక్లెట్ తినాలనే బలమైన కోరిక కలుగుతుంది. ఆ సమయంలో ఎదురుగా చాక్లెట్ కనిపిస్తే అస్సలు నియంత్రించుకోలేరు. చాక్లెట్‌లో ఉండే చక్కెర, కొవ్వు పదార్థాలతో పాటు థియోబ్రోమిన్, ఫెనిల్ ఇథలమైన్ వంటివి మన మెదడులో సెరటోనిన్, డోపమైన్ వంటి 'ఫీల్ గుడ్' హార్మోన్లను విడుదల చేస్తాయి. అందుకే చాక్లెట్ తిన్న వెంటనే మనసుకు ప్రశాంతత, సంతోషం కలుగుతాయి.

అయితే, మీకు తరచుగా చాక్లెట్లు తినాలనిపిస్తే దాన్ని కేవలం.. తీపి తినాలనే కోరికగా మాత్రమే కొట్టిపారేయకండి. ఎందుకంటే, మన శరీరంలో జరుగుతున్న భౌతిక, రసాయన, మానసిక మార్పులను తెలియజేసే అద్భుతమైన బయోఫీడ్‌బ్యాక్ సూచికలే ఈ క్రేవింగ్స్ అని గుర్తుపెట్టుకోండి. చాక్లెట్ తినాలనే విపరీతమైన కోరిక మీ పోషణ లోపాన్ని,...