భారతదేశం, జూలై 28 -- Chitti Chitti Cheema Song: మోస్ట్ టాలెంటెడ్ పాన్-ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) బర్త్‌డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే బహుమతి ఇచ్చేశారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara) మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'చిట్టి చిట్టి చీమ' సాంగ్‌ను అధికారికంగా విడుదల చేశారు. మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ఈ సోల్ ఫుల్ మెలోడీ ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. గ్లింప్స్‌తోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్ర బృందం, ఇప్పుడు ఈ పాటతో ప్రమోషన్ల జోరును పెంచేసింది.

ఆకాశంలో ఒక తార మూవీ నుంచి వచ్చిన ఈ పాట వింటుంటేనే ఒక అద్భుతమైన ఎమోషనల్ ఫీల్ కలుగుతోంది. ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని పెద్ద కలలు కనే ఒక సాధారణ యువతి ఆశయాలు, ఆమె ప్రయాణంలో వెన్నుదన్నుగా నిలిచే భాగస్వామి...