భారతదేశం, జూన్ 23 -- Chiranjeevi Review: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న 'మా ఇంటి బంగారం' మూవీ చూసి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపించేశారు. హీరోయిన్ సమంతతో సహా ఈ మూవీ టీమ్ ను తన ఇంటికి పిలిపించి మరీ చిరు అభినందించారు. ఈ సందర్బంగా సామ్ ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా తన పోస్ట్ ద్వారా మెగాస్టార్ కన్ఫామ్ చేయడం విశేషం.

సమంత లీడ్ రోల్ ప్లే చేసిన మా ఇంటి బంగారం మూవీపై చిరంజీవి రివ్యూ వైరల్ గా మారింది. ఈ మూవీ టీమ్ ను సోమవారం (జూన్ 23) రాత్రి కలిసిన చిరంజీవి అనంతరం తన ఎక్స్ అకౌంట్లో సినిమా గురించి పేర్కొన్నారు.

'''మా ఇంటి బంగారం' చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో యాక్షన్, భావోద్వేగాలను అందంగా మేళవిస్తూ వినోదాత్మకంగా దర్శకురాలు నందిని రెడ్డి తనదైన శైలిలో తెరకెక్కించారు'' అని చిరంజీవి రాసుకొచ్చారు. ...