భారతదేశం, ఆగస్టు 28 -- Chiranjeevi Gv Narayana: ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి.నారాయణరావు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తన మిత్రుడైన ఆయన భౌతికకాయానికి మెగాస్టార్ చిరంజీవి నేరుగా వెళ్లి నివాళులర్పించారు. నారాయణరావు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తన ఆప్తమిత్రుడితో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, తీపి గుర్తును నెమరువేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

జివి నారాయణరావుతో తనకున్న స్నేహం గురించి చిరంజీవి గుర్తు చేసుకున్నారు. "మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో మేమిద్దరం శిక్షణ పొందుతున్న రోజుల నుంచే ఒకరికొకరం బాగా తెలుసు. అక్కడ ఆయన నా కంటే సీనియర్. మేము శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఆయన వచ్చి తన అనుభవాలను మాతో పంచుకునేవారు. ఆ విధంగానే మా మధ్య చొరవ పెరిగి, మంచి స్నేహం ఏర్పడింది" అని చిరంజీవి తెలిపారు....