భారతదేశం, మార్చి 21 -- ఉస్తాద్ భగత్ సింగ్ తో థియేటర్లను షేక్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మిక్సడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా దూసుకెళ్తోంది. ఉగాది సందర్బంగా మార్చి 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజైంది. ఈ మూవీకి హరీష్ శంకర్ డైరెక్టర్. ఈ సినిమాను తాజాగా చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ తో కలిసి చూశారు.

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక చోట కలిశారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని స్పెషల్ గా ఫ్యామిలీతో కలిసి చూశారు. ఈ స్క్రీనింగ్ కు చిరంజీవి దంపతులు, పవన్ కల్యాణ్ దంపతులు, డైరెక్టర్ హరీష్ శంకర్ కపుల్స్, తల్లితో కలిసి హీరోయిన్ శ్రీలీల, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు అటెండ్ అయ్యారు.

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో అన్నయ్య చిరంజీవి సినిమా పాటలను వాడారు. ఇందులో 'వ...