భారతదేశం, జూన్ 24 -- Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన స్పీచ్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో ఒక రేంజ్ హల్చల్ సృష్టిస్తోంది.

ఈ పెద్ది సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ చూసి చాలామంది నేషనల్ అవార్డు గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తుండటంపై చిరు స్పందించిన తీరు తీవ్ర చర్చకు దారితీసింది.

ఒక తండ్రిగా రామ్ చరణ్ పడ్డ కష్టం, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి ఎంతో గర్వపడుతున్నానని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. 'రంగస్థలం', 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాల తర్వాత చరణ్ కెరీర్‌లోనే ఇదొక బెస్ట్ మైల్‌స్ట...