భారతదేశం, జూలై 30 -- Chinna Chinna Aasai Review:

సినిమా : పేరు చిన్న చిన్న ఆశై

నటీనటులు : మధుబాల, ఇంద్రన్స్, అపర్ణ బాలమురళి తదితరులు

డైరెక్టర్ : వర్ష వాసుదేవ్

రిలీజ్ డేట్ : జూన్ 19, 2026 (థియేటర్), జూలై 28 (ఓటీటీ)

ఓటీటీ : జియోహాట్‌స్టార్‌, ఆహా వీడియో, సన్ నెక్స్ట్, టెంట్ కోటా, సింప్లీ సౌత్

మలయాళం సినిమాలంటే సహజంగా ఉంటాయి, మానవ సంబంధాలకు చాలా దగ్గరగా ఉంటాయనే పేరు ఉంది. మల్లువుడ్ నుంచి వచ్చే సినిమాలు హార్ట్ టచింగ్ గా ఉంటాయని కూడా అంటారు. అలాంటి అంచనాల నేపథ్యంలో థియేటర్లలో మంచి హిట్ గా నిలిచిన సినిమా 'చిన్న చిన్న ఆశై'. ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 5 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మధుబాల, ఇంద్రన్స్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ చూసేయండి.

పవిత్రమైన వారణాసి నగరం. అక్కడ అనుకోకుండా కలిసే 52 ఏళ్ల విధవ లీల (మధుబాల), రిటైర్డ్ స్కూల్...