భారతదేశం, జూన్ 11 -- Chinmayi Sripaada vs TVK: లైంగిక వేధింపుల (MeToo) ఆరోపణలు ఉన్న వ్యక్తులకు రాజకీయ వేదికలపై ప్రాధాన్యత ఇవ్వడంపై సింగర్, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద మరోసారి తన గళం వినిపించారు. వివాదాస్పద మలయాళ ర్యాపర్ వేదన్.. తమిళనాడు మంత్రి రాజ్‌మోహన్ అరుముగంను కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై చిన్మయి ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని, మంత్రి రాజ్‌మోహన్‌ను కడిగిపారేశారు.

తమిళనాడు మంత్రి రాజ్‌మోహన్, ర్యాపర్ వేదన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ చిన్మయి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. గతంలో డీఎంకే (DMK) ప్రభుత్వం చేసిన తప్పులనే విజయ్ నేతృత్వంలోని కొత్త టీవీకే ప్రభుత్వం కూడా చేయకూడదని ఆమె కోరారు.

"తీవ్రమైన లైంగిక వేధింపు...