భారతదేశం, ఆగస్టు 19 -- భారత్‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించింది ఓపెన్‌ఏఐ. 'చాట్‌జీపీటీ గో' అనే పేరుతో వచ్చిన ఈ ప్లాన్ ధర నెలకు కేవలం రూ. 399 మాత్రమే! ఈ ప్లాన్ ద్వారా భారతీయ వినియోగదారులు అధిక వినియోగ పరిమితులు, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్స్, ఎక్స్‌టెండెడ్ మెమరీ వంటి ప్రీమియం ఫీచర్లను తక్కువ ధరకే పొందవచ్చు.

చాట్‌జీపీటీ వైస్ ప్రెసిడెంట్, హెడ్ నిక్ టర్లీ మాట్లాడుతూ.. చాట్‌జీపీటీ గో ప్లాన్‌ను ఇతర దేశాలకు విస్తరించే ముందు, ముందుగా భారత్‌లోనే లాంచ్ చేస్తున్నట్టు తెలిపారు. ధర అందుబాటులో ఉండడం, స్థానిక చెల్లింపు పద్ధతులు కావాలని భారతీయుల నుంచి ఎక్కువ అభ్యర్థనలు వచ్చాయి. ఈ కొత్త ప్లాన్ ఆ అభ్యర్థనలను తీరుస్తుందని ఆయన వివరించారు.

చాట్‌జీపీటీ గో ప్లాన్‌తో వినియోగదారులు ఫ్రీ ప్లాన్‌తో పోలిస్తే పది రెట్లు ఎక్కువ మెసేజ్ పరిమితులు, పది ...