భారతదేశం, మే 7 -- Celina Jaitly: బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కుంటోంది. భర్త నుంచి విడాకులు కోరిన ఆమెకు కనీసం పిల్లలు ముఖాలు కూడా చూపించడం లేదు. చేసేదేం లేక చనిపోయిన తన కొడుకు సమాధి దగ్గరకు వెళ్లి సెలీనా వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసును కదలిస్తోంది. ఇటీవల ఆస్ట్రియాకు వెళ్లిన సమయంలో ఎదురైన చేదు అనుభవాలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

ఆస్ట్రియాలో తన పిల్లలను చూడనివ్వలేదని హీరోయిన్ సెలీనా జైట్లీ వాపోయింది. జడ్జీ ముందు మాట ఇచ్చి తప్పారని ఆరోపించింది. పిల్లలను తనకు చూపించకుండా దాచేశారని ఆమె బాధ పడింది. చనిపోయిన తన కొడుకు సమాధిని శుభ్రం చేస్తూ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియోను ఇన్ స్టాలో పంచుకుంది.

"ఒక తల్లిగా నా వేదనను ప్రపంచానికి చూపించడానికి ఈ వీడియోను షేర్ చేయడం తప్ప నా...