భారతదేశం, సెప్టెంబర్ 14 -- క్యాట్ 2025 దరఖాస్తు గడువును పొడిగించింది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కోజికోడ్. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు సెప్టెంబర్ 20, 2025, శనివారం సాయంత్రం 5 గంటల వరకు రిజిస్టర్​ చేసుకోవచ్చని ప్రకటించింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఐఐఎం క్యాట్ అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అంతకుముందు దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 13, 2025 గా ఉండేది.

క్యాట్​ 2025కి దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు డ్రాప్-డౌన్ మెను నుంచి తమకు నచ్చిన ఐదు పరీక్షా నగరాలను ఎంచుకోవచ్చు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత, అందుబాటులో ఉన్న వాటిని బట్టి ఈ ఐదు నగరాలలో ఒక దానిని కేటాయిస్తారు.

క్యాట్ 2025 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాలకు చెందిన ...