భారతదేశం, ఏప్రిల్ 3 -- సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు చర్చకు వచ్చే 'కాస్టింగ్ కౌచ్' (Casting Couch) భూతం మరోసారి టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. గతంలో ఎందరో నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకోగా, తాజాగా ఒక తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఒక ప్రముఖ నిర్మాత పేరుతో తనకు ఎదురైన వేధింపుల గురించి ఆమె వీడియో విడుదల చేయడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

న్యూయార్క్‌లో ఉంటున్న 'పికు నెమలి' (Piku Nemali) అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్, తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ చేదు అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. తనకు తెలిసిన వారి ద్వారా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో ఆమె తన వివరాలను అతనికి పంపారు.

ఆ...