భారతదేశం, ఏప్రిల్ 1 -- ఒక్క ఛాన్స్ అంటూ సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ ల చుట్టూ తిరుగుతున్నారా? ఒక్కసారి బిగ్ స్క్రీన్ పై కనబడాలన్నది మీ కలనా? అయితే ఈ అవకాశం మీ కోసమే. షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్స్ స్థాయికి ఎదిగిన చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నుంచి కాస్టింగ్ కాల్ వచ్చింది. ఈ కాస్టింగ్ కాల్ అనౌన్స్ మెంట్ ను చాయ్ బిస్కెట్ వెరైటీగా అనౌన్స్ చేయడం విశేషం.

సాధారణంగా కాస్టింగ్ కాల్ అంటే సినిమాల్లో ఆర్టిస్టులు కావలెను, నటీ నటులు కావలెను అనే ప్రకటనలు వస్తాయి. ఏ క్యారెక్టర్, ఏ ఏజ్ అంత అనేది చెప్తారు. కానీ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మాత్రం వెరైటీగా కాస్టింగ్ కాల్ ప్రకటన ఇచ్చింది.

''ల*గలు, దొంగలు, చిల్లర చిచోరోళ్ల లెక్క కనబడేటోళ్లు మాకు కావాలె'' అనే పోస్టర్ తో చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. 55 నుంచి 70 ఏళ్ల పురుషుడు, మహిళ, 25 నుంచ...