భారతదేశం, నవంబర్ 4 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు ప్రపంచ సాఫ్ట్‌వేర్ రంగాన్ని కుదిపేస్తున్నాయి! ఫలితంగా అనేక సంస్థలు భారీ లేఆఫ్స్​ చేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరింది ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ కంటెంట్ క్రియేషన్ ప్లాట్‌ఫారమ్ 'కాన్వా'. తమ సంస్థలోని సిబ్బందిలో ఏకంగా 22 శాతానికి పైగా తొలగిస్తున్నట్లు ప్రకటించిన కాన్వా.. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.

మొత్తం 1,271 మంది ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడనుందని కంపెనీ సహ వ్యవస్థాపకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెలానీ పెర్కిన్స్ ఉద్యోగులకు పంపిన ఒక లేఖలో వెల్లడించారు. 13 ఏళ్ల కంపెనీ చరిత్రలోనే ఇది అత్యంత కఠినమైన నిర్ణయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన 'క్లాడ్', చాట్‌జీపీటీ వంటి అత్యాధునిక ఏఐ టూల్స్ అంద...