భారతదేశం, ఆగస్టు 24 -- కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్​) కోసం చూస్తున్న భారతీయులు సహా ఇతర విదేశీయులకు శుభవార్త! ఇకపై వారు తమ ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను నిరూపించుకోవడానికి మరో కొత్త టెస్టింగ్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్​సీసీ) త్వరలో TOEFL (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్) ఎస్సెన్షియల్స్ పరీక్షను అంగీకరించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఐఆర్​సీసీ TOEFL పరీక్షను అంగీకరించడం లేదు. అయితే, ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందనే వివరాలను త్వరలో తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని ఐఆర్​సీసీ తెలిపింది. ఈ కొత్త మార్పు వల్ల శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని నిరూపించుకోవడానికి TOEFL టెస్ట్ ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

TOEFL పరీక...