భారతదేశం, ఆగస్టు 24 -- చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బీవైడీ భారతదేశంలో తన ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని మరింత విస్తరించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అట్టో 3, సీల్, ఈమాక్స్ 7, సీలయన్ వంటి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసిన తర్వాత.. ఇప్పుడు బీవైడీ అట్టో 2ను సీక్రెట్​గా భారత రోడ్లపై పరీక్షిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఇప్పటికే యూకే మార్కెట్‌లో అందుబాటులో ఉంది. కారును పూర్తిగా కవర్‌తో కప్పి ఉంచినప్పటికీ, వెనుక లైట్లు, సైడ్​ భాగం ఆధారంగా ఇది అట్టో 2 అని గుర్తించవచ్చు.

యూకేలో బీవైడీ అట్టో 2 ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర 30,850 పౌండ్లు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 32.50 లక్షలకు సమానం! స్వల్ప మార్పులతో భారతదేశంలోకి వస్తే, దీని ధర రూ. 35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.

ఒకవేళ యూకేలో విడుదలైన యూరో-స్పెక్ బీవైడీ అట్ట...