భారతదేశం, నవంబర్ 17 -- ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో మంగళవారం వేకువజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు గులార్ మార్కెట్ సమీపంలోని వంతెన పైనుంచి అదుపుతప్పి 100 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అధికారిక వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యూకే09పీఏ-9779 రిజిస్ట్రేషన్ నంబర్ గల బస్సు హరిద్వార్ నుంచి చమోలీ బయలుదేరింది. గులార్ మార్కెట్ దగ్గర ఉన్న వంతెన వద్దకు రాగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెన పైనుంచి కింద ఉన్న లోతైన లోయలోకి దూసుకెళ్లింది. వేకువజాము సమయం కావడంతో ప్రయాణికులకు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పెను విషాద...