భారతదేశం, మార్చి 24 -- ధురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు జనాలు ఈ సినిమాలోని ప్రతి సీన్ గురించి, క్యారెక్టర్ల గురించి తెగ చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ అయితే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో రణ్‌వీర్ సింగ్ చేసిన హమ్జా క్యారెక్టర్‌ను చూసి ఒకరు.. "ఇంటికి రావాలనిపించలేదా జస్సీ?" (ఘర్ కీ యాద్ నహీ ఆయీ జస్సీ?) అని అడుగుతారు. ఇప్పుడు ఈ డైలాగ్ ట్రెండ్‌లోకి మన స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజనా గణేశన్ కూడా వచ్చి చేరింది.

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సంజనా ఒక ఫన్నీ మీమ్ షేర్ చేసి, పెళ్లయిన తర్వాత మగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సరదాగా చెప్పింది. బుమ్రా ఎప్పుడైనా తన ఫ్రెండ్స్‌తో కలిసి బాయ్స...