భారతదేశం, సెప్టెంబర్ 13 -- భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఆధిపత్యాన్ని సాధించేందుకు వియత్నాం దిగ్గజం 'విన్‌ఫాస్ట్' తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసినట్టు కనిపిస్తోంది! అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడళ్లను నేరుగా భారత్‌కు తీసుకొచ్చి విక్రయించే ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టడం ఇందుకు కారణం. మన దేశ వినియోగదారుల అభిరుచులు, మధ్యతరగతి ప్రజ జేబుపై భారం పడకుండా బడ్జెట్‌కు తగినట్లుగా ప్రత్యేకంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి విన్​ఫాస్ట్ సన్నాహాలు ప్రారంభించింది.

ఈ ఎలక్ట్రిక్ కార్లను సంస్థ అంతర్గతంగా 'వీఎఫ్ ఎక్స్', 'వీఎఫ్ వై' అనే కోడ్ పేర్లతో పిలుస్తోంది. నిజానికి గతంలో తమ గ్లోబల్ మోడళ్లైన వీఎఫ్ 3, వీఎఫ్ 6, వీఎఫ్ 7 కార్లను భారత్‌లోనే తయారు చేయాలని కంపెనీ భావించింది. అయితే, ఇక్కడి మార్కెట్‌కు తగ్గట్లు తక్కువ ధరకు వాటిన...