భారతదేశం, జనవరి 31 -- కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో మధ్యతరగతి కుటుంబాల్లో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈసారి ప్రజలు మరీ ఆకాశాన్ని అంటే డిమాండ్లు కాకుండా, వాస్తవికమైన మార్పులనే కోరుకుంటున్నారు! ప్రధానంగా ఆదాయ స్థిరత్వం, అదుపులో ఉండే ధరలు, గృహ నిర్మాణం, ఆరోగ్యం వంటి నిత్యం ఎదుర్కొనే ఖర్చులను తగ్గించేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఆశిస్తున్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమెకు వరుసగా 9వ బడ్జెట్​ ప్రసంగం.

బడ్జెట్ ముందస్తు చర్చలపై 'మ్యాక్సిమ్ వెల్త్' వ్యవస్థాపకుడు, సీఈఓ రామ్ మేడూరి స్పందిస్తూ.. "ప్రతి ఏటా బడ్జెట్ అనగానే వేతన జీవుల మనసులో మెదిలే మొదటి ప్రశ్న.. ఈ ఏడాదైనా పన్నులు న్యాయబద్ధంగా కనిపిస్తాయా? అని! ఈసారి బడ్జెట్ 2026 పై ఆ అంచన...