భారతదేశం, మార్చి 21 -- గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్స్ (బీటీఎస్) BTS మరోసారి చరిత్ర సృష్టించారు. దాదాపు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఏడుగురు సభ్యులు కలిసి తమ ఐదవ పూర్తి స్థాయి ఆల్బమ్ 'అరిరాంగ్' (Arirang)తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. హైబ్ యాజమాన్యంలోని బిగ్ హిట్ మ్యూజిక్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఆల్బమ్ విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3.98 మిలియన్ (39.8 లక్షలు) కాపీలు అమ్ముడయ్యాయి.

బీటీఎస్ మ్యూజిక్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇప్పుడు నాలుగేళ్ల బ్రేక్ తర్వాత బీటీఎస్ గ్రూప్ కలిసి క్రియేట్ చేసిన అరిరాంగ్ ఆల్బమ్ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. ఇది కేవలం కె-పాప్ (K-Pop) చరిత్రలోనే కాదు, గ్లోబల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిందని చెప్పొచ్చు. గతంలో బీటీఎస్ వాళ్లదే అయిన 'Map of the S...