భారతదేశం, సెప్టెంబర్ 7 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజును అందరికి ముందూ ఇరికించాలని రేఖ వేసిన ప్లాన్ ఫెయిలవుతుంది. రాజును ఇందు కాపాడుతుంది. అయితే సిరి తన భార్య కాదని, అసలు ఏం జరిగిందో ఆమెకు మొత్తం చెప్పేస్తాడు రాజు. అటు లక్కీని ఉపయోగించుకొని ఆస్తిపై రేఖ కన్నేస్తుంది.

రాజుని సిరి గురించి అడిగి రేఖ ఇరికించే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. హాస్పిటల్ కు ఎందుకు వెళ్లావ్.. అక్కడ ఎవరున్నారు అని రేఖ నిలదీస్తుంది. నీకు సంబంధించిన వాళ్లందరూ ఇక్కడే ఉన్నారు కదా అని అంటుంది.

దీంతో చలపతి కూడా హాస్పిటల్ కు ఎందుకు వెళ్లావని అడుగుతాడు. కానీ రాజు మాత్రం నోరు తెరవడు. ఎవరో తెలిసిన వాళ్లు కావచ్చు.. అందుకే వెళ్లాడని అపర్ణ రాజుని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో హాస్పిటల్లో...