భారతదేశం, సెప్టెంబర్ 25 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ సిరి గురించి తెలుసుకోవడానికి ఇటు రాజు, ఇందు.. అటు భ్రమరాంబ చేసే ప్రయత్నాల చుట్టూ తిరిగింది. అటు రాజు, ఇందు.. మదన్, స్వాతి ఇంటికి కూడా వెళ్తారు. కానీ రేఖ విషయంలో మదన్ వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెబుతాడు.

సిరి ఇంటికి రాజు, ఇందు వెళ్లే సీన్ తో సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 25) ఎపిసోడ్ మొదలైంది. అక్కడ ఇంట్లో ఎవరూ ఉండరు. పక్కనున్న ఓ మహిళ వచ్చి ఏం కావలని అడిగితే సిరి తండ్రి శ్రీనివాస్ గురించి అడుగుతారు. వాళ్లు రెండేళ్ల కిందట ఉండే వాళ్లని, తర్వాత కనిపించకుండా పోయారని ఆమె చెబుతుంది. వాళ్లకు ఇంకా ఎవరూ లేరని, ఆయన భార్య చాలా ఏళ్ల కిందటే చనిపోయిందని అనడంతో రాజు బాధపడతాడు.

వాళ్లు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదని, వాళ్ల గురించి పెద్దగా విషయ...