భారతదేశం, సెప్టెంబర్ 16 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. వ్యభిచారం కేసులో అరెస్టయిన మదన్, స్వాతిలను విడిపించడానికి రాజు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. వాళ్లు స్టేషన్ లోనే పెళ్లి చేసుకుంటారు. మరోవైపు రాజు ఇంట్లో సిరి చుక్కలు చూపిస్తుంటే.. చలపతి ఆమెను కంట్రోల్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు.

ఐశ్వర్య చెప్పడం వల్లే తనను రాజు కిడ్నాప్ చేశాడన్న విషయం తెలుసుకొని ఇందు చిటపటలాడే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. ఆ విషయం తనకు చెప్పనందుకు ఇందు కోప్పడుతుంది. రాజుపై అలుగుతుంది. దీంతో రాజు ఆమెను బతిమాలుతాడు. సారీ చెబుతాడు. ఈ విషయం ముందే చెబుదామనుకున్నాను కానీ ఏదో సంజాయిషీ ఇవ్వబోతాడు. కానీ ఇందు వినదు. ఇలా ఎన్ని సీక్రెట్స్ ఇంకా దాచి పెట్టావో అని నిందిస్తుంది.

అ...