భారతదేశం, అక్టోబర్ 17 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందును కలపడానికి అపర్ణ వేసిన ప్లాన్ ఫెయిలవుతుంది. అయినా ఆమె మాత్రం ప్రయత్నాలు ఆపదు. దీనికి లక్కీ బలవుతాడు. అటు సొంత కంపెనీలోనే ఐశ్వర్యకు అవమానాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

పనిమనిషి వసంత కోసం శేషు నీటుగా రెడీ అయి అర్ధరాత్రి బయటకు వచ్చే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 17) ఎపిసోడ్ మొదలవుతుంది. ఆ తర్వాత వసంత కూడా వస్తుంది. అటు రాజు, ఇందు.. తర్వాత నందు, వెంకీ.. ఆ తర్వాత రేఖ, భూషణ్ కూడా ఒకరిని వెతుకుతూ మరొకరు ఇంటి బయటకు వస్తారు.

దీంతో అర్ధరాత్రి వేళ దుగ్గిరాల ఇంటి బయట ఓ హంగామా క్రియేట్ అవుతుంది. వీళ్లంతా ఒకరిని చూసి మరొకరు దాక్కుంటారు. తన పార్ట్‌నర్స్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఒక చిన్న అయోమయం కాస్తా అందరికీ అర్ధరాత్రి నిద్ర లేకుండా ...