భారతదేశం, అక్టోబర్ 10 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు జీవితంలో నుంచి సిరి వెళ్లిపోతుంది. తన బావను పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. ఆ తర్వాత రాజు, ఇందు తమ పెళ్లిళ్ల గురించి మాట్లాడుకుంటారు. మరోవైపు లక్కీ, ఐశ్వర్య పెళ్లికి అన్నీ సిద్ధంగా కాగా.. పీటలపై ఐషూ ఆగండి అంటూ పెద్ద ట్విస్ట్ ఇస్తుంది.

రాజుకు సిరి థ్యాంక్స్ చెప్పే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 10) ఎపిసోడ్ మొదలైంది. నీ విషయంలో ఇందు కూడా ఎంతో చేసిందని రాజు చెప్పడంతో సిరి ఆమెకు కూడా థ్యాంక్స్ చెబుతుంది. నువ్వో దేవతలా కనిపిస్తున్నావని అంటుంది. ఇందులాంటి భార్య దొరికినందుకు నువ్వో అదృష్టవంతుడివి అని రాజుకి.. రాజులాంటి భర్త దొరికినందుకు నువ్వూ ఈ అదృష్టవంతురాలివి అని ఇందుతో అంటుంది.

ఇక తాను వెళ్తానని సిరి అంటే.. తమతోపాటే ఉండిపోవచ్చు క...