భారతదేశం, నవంబర్ 7 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందు శోభనం కోసం ముహూర్తం చూస్తారు. అటు రాజు దగ్గరికి వచ్చిన లక్కీ క్షమాపణ చెప్పినా రాజు మాత్రం పట్టించుకోడు. ఇక ఫ్రెండ్షిప్ కట్ అనేస్తాడు. మరోవైపు ఎపిసోడ్ చివర్లో దుగ్గిరాల ఇంట్లోకి మళ్లీ సీతారామయ్య, ఇందిరా దేవి ఫొటోలు తిరిగి వస్తాయి.

రాజును తలచుకొని చలపతి మండిపడే సీన్ తో సీరియల్ శనివారం (నవంబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. లక్ష్మీని తిడుతూ ఉంటాడు. ఇంతలో వెంకీ తాను ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నా అంటూ బయటకు వస్తాడు. నిజంగానే ఇంటర్వ్యూకి వెళ్తున్నావా లేదంటే నువ్వూ ఆ ఇంటికే వెళ్తున్నావా అని చలపతి నిలదీస్తాడు. వెంకీకి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. ఆ రాజుగాడు ఇప్పటికే ఓ ముళ్లకంప మీద ఉన్నాడు.. ఆ దుగ్గిరాల కొంప ఓ ముళ్ల కంప.. అందులోకి వెంకీని కూడా పంపించ...