భారతదేశం, మార్చి 9 -- బ్రహ్మముడి సీరియల్ మార్చి 9 ఎపిసోడ్ లో ఐశ్వర్య చీటింగ్ చేస్తూ పట్టుబడటం, ఎగ్జామ్ రాసొచ్చి రేఖకు ఇందు దొరికిపోవడం, అటు నకిలీ ల్యాప్‌టాప్ ను రాజు అమ్మేయడం, చివరికి ఇందు ఆస్తి మొత్తం కాజేయాలని చూసే రేఖ.. సుభాష్ సర్జరీకి మాత్రం డబ్బుల్లేవంటూ ఇందుపై అరవడంలాంటివి చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మార్చి 9) ఎపిసోడ్ ఎగ్జామ్ హాల్లో చీటింగ్ చేస్తూ ఐశ్వర్య పట్టుబడే సీన్ తో మొదలవుతుంది. చిట్టీ చూస్తూ రాస్తుండగా ఇన్విజిలేటర్ ఆమెను పట్టుకుంటాడు. అయినా కూడా ఐశ్వర్య నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. మీరు ఎగ్జామ్ రాసివ్వకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు.. బయట ఎన్నో సర్టిఫికెట్లు దొరుకుతాయి అని అంటుంది. అంతేకాదు తన ఫ్రెండ్స్ దగ్గర కూడా చిట్టీలు ఉన్నాయంటూ వాళ్లనూ ఇరికించి తనతోపాటు తీసుకెళ్తుంది.

మరోవైపు చక్...