భారతదేశం, ఆగస్టు 7 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్య అప్పు నాటకం, రేఖను ఇరికించడానికి రాజు వేసే మరో ప్లాన్, నందు గురించి తలుచుకుంటూ వెంకీ బాధపడటంలాంటి సీన్లను చూడొచ్చు. లక్కీ పెళ్లి చూపుల వేళ రేఖకు దారుణమైన అవమానం కూడా జరుగుతుంది.

ఐశ్వర్య తన దగ్గర రూ.3 లక్షల అప్పు చేసిందని, వెంటనే తీర్చమని ఓ వ్యక్తి గొడవకు దిగే సీన్ తో సీరియల్ శుక్రవారం (ఆగస్ట్ 7) ఎపిసోడ్ మొదలైంది. అప్పు ఎందుకు చేశావని ఇందు నిలదీస్తుంది. కానీ ఐషూ ఎదురు తిరుగుతుంది. తాను అప్పు చేయలేదని, చేసేలా మీరే చేశారని ఇందుని తప్పుబడుతుంది.

తాను డబ్బు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదని, అందుకే అప్పు చేశానని రేఖను, ఇందును తిడుతుంది. అప్పు తీర్చలేకపోతే కారు తాళాలు ఇవ్వండని ఆ వ్యక్తి అంటాడు. ఆ కారు పేపర్లు తాకట్టు పెట్టే అప్పు తీసుకుంద...