భారతదేశం, ఆగస్టు 22 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖతో రాజు ఆడుకుంటాడు. చివరికి తన డీఎన్ఏ రిపోర్ట్ సంపాదించి దానిని రేఖ చించేసినా.. సాఫ్ట్ కాపీ అంటూ రాజు మరో అస్త్రం వదులుతాడు. అటు డిగ్రీ పాసైతే కొత్త కంపెనీ పెట్టిస్తానంటూ ఐశ్వర్యకు ఇందు ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంది.

తన డీఎన్ఏ రిపోర్ట్ రాజు ఎక్కడ పెట్టాడో తెలియక పరుగెత్తుతున్న రేఖ.. భ్రమరాంబ చేతుల్లో ఓ పేపర్ చూసి కంగారు పడే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 22) ఎపిసోడ్ మొదలవుతుంది. ఆ పేపర్ ఆమె చేతుల్లో నుంచి తీసుకోవడానికి నానా తంటాలు పడుతుంది.

చివరికి ఆమె చేతుల్లో ఉన్నది డీఎన్ఏ రిపోర్ట్ కాదని, శేషుకు భ్రమరాంబ పండ్లు, ఇతర సరకుల కోసం రాసిచ్చిన లిస్ట్ అని తెలిసి రేఖ ఊపిరి పీల్చుకుంటుంది. అందులో సగం నొక్కేశాడని చిందులేస్తుంటుంది భ్రమరాంబ. కాన...