భారతదేశం, ఏప్రిల్ 9 -- Brahmamudi April 9th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇటు ఇందు, అటు ఐశ్వర్య వేసిన కిడ్నాప్ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించదు. దీంతో ఆస్తి పత్రాలపై ఇందు వేలి ముద్ర వేయడానికి సిద్ధమవుతుంది. అయితే చివర్లో మీడియా రంగంలోకి దిగడమే కాస్త ట్విస్ట్ అని చెప్పొచ్చు.

బ్రహ్మముడి సీరియల్ గురువారం (ఏప్రిల్ 9) ఎపిసోడ్ రాజును అపర్ణ చూసే సీన్ తో మొదలవుతుంది. ఇందును ఎలా కిడ్నాప్ చేయాలా అని లక్కీతో రాజు ప్లాన్ చేస్తుండగా అనుకోకుండా అపర్ణ వచ్చి అతన్ని ఢీకొడుతుంది. అప్పుడే అతడు మాస్క్ వేసుకోవడంతో అతన్ని సరిగా చూడదు.

కానీ అతని కళ్లు చూస్తుంటే ఎవరో తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారని, ఒకసారి మాస్కు తీయాలని అతన్ని అడుగుతుంది. దీంతో రాజు షాక్ తింటాడు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో.. నేను ఆ వ్యక్తిని కాను అని రాజు కవర్ చ...